ఇళ్ల స్థలాల పట్టాలు అందుకున్న లబ్ధిదారులకు ఏడాదిలోపు ఇంటిని సైతం నిర్మించి ఇస్తామని.. మంత్రి ఆళ్లనాని స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని శనివారపుపేటలో 600 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు.
అనంతరం ఇళ్ల నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. గృహాలు లేని ప్రతి ఒక్కరికీ ఇంటిని నిర్మించి ఇచ్చే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని వెల్లడించారు. రానున్న మూడున్నరేళ్లలో సొంతిల్లు లేని వారంటూ రాష్ట్రంలో ఉండరని తెలిపారు.