ఎల్వీ ప్రసాద్ విజన్ ఇనిస్టిట్యూట్లో ప్రత్యేక కార్యక్రమం - lv prasad
ఎల్వీ ప్రసాద్ విజన్ ఇనిస్టిట్యూట్ వార్షికోత్సం పురస్కరించుకుని కొవ్వాలిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కంటి శస్త్ర చికిత్సలు అవసరమైన వారికి ఉచితంగా వైద్యం అందిస్తామని నిర్వాహకులు తెలిపారు.
పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వాలిలో ఎల్వీ ప్రసాద్ విజన్ ఇనిస్టిట్యూట్ 8వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పేద ప్రజలకు సేవ అందించాలనే లక్ష్యంతో కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలో 20 కేంద్రాల ద్వారా కంటి పరీక్షలు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శస్త్ర చికిత్స అవసరమైన వారికి ఉచితంగా వైద్యం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు. ప్రత్యేక కార్యక్రమానికి ఎల్వీ నేత్ర వైద్యశాలల్లో ఉచిత శస్త్ర చికిత్స చేయించుకున్న వారు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.