పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం తేతలి వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వారిని లారీ ఢీకొనడంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో వ్యక్తి స్వల్పగాయాలతో బయటపడ్డాడు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసకొని దర్యాప్తు చేపట్టారు.
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ... ఒకరు మృతి - tetali
అతివేగం ఓ ప్రాణాన్ని బలిగొంది. వేగంగా వచ్చిన లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా... మరొకరు స్వల్పగాయాలతో బయటపడ్డారు.
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ...ఒకరు మృతి