తణుకులో 200కోట్ల అభివృద్ధి పనులు :తెదేపా - MUNCIPALITY
తణుకులో పురపాలక సంఘ పాలకవర్గ పదవీకాల పూర్తయిన సందర్భంగా ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తణుకు అభివృద్ధికి తెదేపా ప్రభుత్వం విశేషంగా కృషి చేసిందని పలువురు నేతలు స్పష్టం చేశారు.
పురపాలక సంఘం పదవీ కాలం పుర్తైన సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆధునీకరించిన పురపాలక సంఘం కార్యాలయ భవనాన్ని మాజీ చైర్మన్ సుధాకర్ తో కలిసి మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వరావు ప్రారంభించారు. గడిచిన ఐదేళ్లలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి పనులు చేశామని తెదేపా మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా అన్నారు. ఈ సారి మున్సిపల్ ఎన్నికల్లో తప్పక గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. గత తెదేపా హయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో తణుకులో 200కోట్ల అభివృద్ధి పనులు చేశామని మరో మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు.