ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆ 30 మంది ఓటర్లకు ఇవే చివరి ఎన్నికలు! - ap local poll news

ఆ గ్రామంలో వారికి ఇవే చివరి ఎన్నికలు! ఇక అక్కడి నుంచి ఓటు వేసే వీలు లేదు వారికి. అలా అని ఓటు హక్కు వినియోగించుకోరని కాదు. ఇకపై తాము పుట్టినగడ్డపై ఓటు వేయరన్నమాట. ఇంతకీ ఆ ఊరివారంతా ఎక్కడికి వెళ్తారు? ఎందుకు వెళ్తారో తెలుసుకుందాం.

last elections to polavaram rehabilitation village thelladhibbala
last elections to polavaram rehabilitation village thelladhibbala

By

Published : Mar 13, 2020, 9:21 AM IST

తరతరాలుగా పాపికొండల్లోనే వారి బతుకులు. నదిపై ఆధారపడే జీవితాలు వారివి. గోదావరి నదీమా తల్లి ఒడిలోనే.. కాలం వెళ్లదీస్తున్నారంతా. కానీ ఇకపై వేరే చోటుకి వెళ్లి పోతారేమో. రోడ్డు, రవాణా సదుపాయానికి నోచుకోలేదు వారు. నిత్యావసరం నుంచి అత్యవసరం వరకూ.. ఆఖరికి ఎన్నికల్లో ఓటు వేయాలన్నా దోనెలపై గంటల ప్రయాణం చేయాల్సిందే. కానీ ఇసారి వారికి ఇవే చివరి ఎన్నికలు.. వాళ్లు వెళ్లినా.. వెళ్లకపోయినా.. పోలవరం ప్రాజెక్టు కింద మునిగిపోతున్న గ్రామాల్లో మనం చెప్పుకోబోయే గ్రామం కూడా ఉంది.

ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులను జూన్ నెలాఖరు నాటికి పునరావస కాలనీలకు తరలించాలని చూస్తోంది. అందులో భాగంగా కాలనీల నిర్మాణం పూర్తి చేసింది. పునరావస కాలనీలకు తరలించే గ్రామాల్లో తెల్లదిబ్బలు గ్రామం కూడా ఉంది. పోలవరం మండలం కొరుటూరు పంచాయతీ పరిధిలోని తెల్లదిబ్బల గ్రామంలో కొండరెడ్డి తెగకు చెందిన గిరిజన కుటుంబాలు ఉన్నాయి. నిత్యావసరాలు, విద్య, వైద్యం కావాలంటే వీరంతా కొరుటూరు రావాల్సిందే. ఓటు కూడా కొరుటూరు పోలింగ్ కేంద్రానికి వచ్చి వేయాల్సిందే. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో మునిగిపోయే మండలంలో ఆఖరి గ్రామం ఇదే. ఆ గ్రామంలో 30 మంది ఒటర్లు ఉన్నారు. అనాదిగా ఎప్పుడు ఎన్నికలు జరిగినా పోటీ చేసే నాయకులు అంత దూరం వెళ్లే పరిస్థితి లేదు. వారి తరఫున దిగువశ్రేణి నాయకులు వెళ్లి ఓటు వేయాల్సిందిగా చెప్పి.. ఎంతో కొంత ముట్టజెప్పి వస్తారు.

ఎన్నికల రోజున తెల్లదిబ్బలు గ్రామస్థుల కోసం ప్రత్యేకంగా లాంచీలు, బోట్లు ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. దాంతో వారు బూరుగు కొమ్మలతో తయారు చేసిన దోనెలపై వచ్చి ఓటు వేసి వెళ్తుంటారు. ఆ గ్రామానికి చెందిన ప్రతి ఒక్క మహిళా దోనె నడపడంలో, గోదావరి ఈదడంలో ఆరితేరి ఉంటారు. పురుషులతో పని లేకుండా ఎవరికి వారు దోనెలపై బయలుదేరి పనులు చక్కబెట్టుకుని తిరిగి వెళ్తుంటారు. జీలుగుమిల్లి మండలంలో పునరావాసం కోరుకున్న తెల్లదిబ్బలవాసులు రాబోయే ఎన్నికల నాటికి పునరావస కాలనీలోనే ఓటువేసే అవకాశం ఉంది.

ఇదీ చదవండి:నువ్వలరేవు.. అంతా నవ్వుతూ.. ఒకే మాట ఒకే బాట!

ABOUT THE AUTHOR

...view details