ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లంక గ్రామాల్లో నిలిచిపోయిన రాకపోకలు - floods to godavari

గోదావరి వరదలు పశ్చిమగోదావరి జిల్లా ప్రజలను ముంచెత్తుతున్నాయి. యలమంచిలి, ఆచంట మండలాల్లోని ప్రజలు నిరాశ్రయులయ్యారు. మరోవైపు వేలాది ఎకరాల పంట నీట మునిగింది. లంక గ్రామాల నుంచి ప్రజల రాకపోకలు పూర్తిగా స్తంభించాయి.

Flood Water in west godavari district
Flood Water in west godavari district

By

Published : Aug 18, 2020, 8:19 PM IST

గోదావరి వరదతో లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వశిష్ట గోదావరి పోటెత్తడంతో పశ్చిమగోదావరి జిల్లాలో ఎనిమిది లంక గ్రామాల్లోకి వరద ప్రవేశించింది. యలమంచిలి, ఆచంట మండలాల్లో లంక గ్రామాలు వరద తాకిడితో వణికిపోతున్నాయి.

యలమంచిలి మండలం దొడ్డిపట్ల, యలమంచిలి లంక, బూరుగుపల్లి, లక్ష్మీపాలెం గ్రామాల్లోకి భారీ స్థాయిలో వరద నీరు ప్రవేశించింది. ఇళ్లలోకి సైతం వరద నీరు ప్రవేశించడంతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ఆచంట మండలం అయోధ్యలంక, అనగారి లంక, గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గోదావరి వరద భారీ స్థాయిలో ఉండడంతో వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. తమలపాకులు, అరటి, కూరగాయలు, వరి పంటలు భారీగా దెబ్బతిన్నాయి. లంక గ్రామాల నుంచి ప్రజల రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నా.. సదుపాయాలు ఉండడం లేదని వరద బాధితులు అంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details