స్పిన్నింగ్ మిల్లులో పడి కార్మికురాలు మృతి - spinning mill
ప.గో జిల్లా అన్నవరప్పాడు గ్రామ పరిధిలోని స్పిన్నింగ్ మిల్లులో ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు జారిపడి ఓ కార్మికురాలు మృతి చెందింది.
స్పిన్నింగ్ మిల్లులో పడి కార్మికురాలు మృతి
పశ్చిమగోదావరి జిల్లా అన్నవరప్పాడు గ్రామ పరిధిలోని స్పిన్నింగ్ మిల్లులో కార్మికురాలు మృతి చెందింది. మిల్లులో పనిచేస్తున్న అల్లాడి వెంకటలక్ష్మి ప్రమాదవశాత్తు యంత్రంలో జారిపడింది. తీవ్ర గాయాలపాలైన ఆమె.. అక్కడికక్కడే మృతి చెందింది. పెరవలి మండలం పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.