పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలో ఖరీఫ్ వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. నిన్నటి వరకు వర్షాలు లేక పట్టిసీమలో నీరురాక నిరాశతో ఎదురు చూసిన రైతులు... ప్రస్తుతం ఇటు వర్షాలతోపాటు అటు పట్టిసీమ నీరు రావటంతో వ్యవసాయ పనులు ముమ్మరం చేశారు. ఇప్పటికే గోదావరి డెల్టా కింద ఖరీఫ్ నాట్లు 50 శాతం పూర్తవగా మిగిలిన చోట్ల మొదలయ్యాయి. పెదవేగి, పెదపాడు, ఏలూరు గ్రామీణ మండలాల్లో పట్టిసీమ నీటితో పనులన్నీ యంత్రాలు, స్థానిక మహిళలతో వివిధ పద్ధతుల్లో నాట్లు వేసే కార్యక్రమాలు చేపడుతున్నారు. నీటిని చెరువులకు తరలించి వాటి కింద సాగు చేస్తున్నారు. మొత్తంగా వరి సాధారణ విస్తీర్ణం 21 వేల హెక్టార్లు కాగా ఇప్పటి వరకు నాలుగు వేల హెక్టార్లలో నాట్లు వేయడం పూర్తయింది.
చిగురిస్తున్న ఆశలు... సాగులోకి అన్నదాతలు - దెందులూరు
అశల సాగు ప్రారంభమైంది. రైతాంగం వ్వవసాయంలో కేంద్రీకృతమైంది. నాట్లు వేస్తుండడంతో భూమి ఆకుపచ్చ వర్ణంతో ఆకట్టుకుటోంది. రైతులు, కూలీల రాకతో పొలాల్లో సందడి కనిపిస్తోంది.
పట్టిసీమతో ఖరీఫ్ సాగు పనులు ముమ్మరం