తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలోని కామాక్షి పీఠం శాశ్వత సభ్యురాలు వక్కలంక వాణికి ఆదివారం 60 వసంతాల వేడుక (షష్టి పూర్తి) నిర్వహించారు. ఈ వేడుకను నిర్వహించింది ఆమె కన్నబిడ్డలు కాదు.. అసలు ఆమెకు వివాహమే కాలేదు. 1982 నుంచి అమలాపురంలోని పీఠంలో ఆమె చేతుల మీద పెరిగిన 156 మంది అనాథలు.. తమ అమ్మకు ఘనంగా 60 వసంతాల వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించారు. ‘వివాహం చేసుకుంటే చిన్నారులకు దూరమవుతాననే భయంతోనే ఆ ఆలోచనను కూడా దరిచేరనీయలేదు. బంధువులు, కుటుంబసభ్యులు ఒత్తిడి చేసినా ఈ పిల్లల్నే నా వాళ్లుగా భావిస్తూ వారికి సేవ చేస్తున్నా’ అని వాణి ఈ సందర్భంగా చెప్పారు.
అనాథల అమ్మకు అంగరంగవైభవంగా షష్టి పూర్తి - AP NEWS
తూర్పు గోదావరి జిల్లా కామాక్షి పీఠం శాశ్వత సభ్యురాలు వక్కలంక వాణికి ఆదివారం షష్టిపూర్తి వేడుక నిర్వహించారు.
అనాథల అమ్మకు అంగరంగవైభవంగా షష్టి పూర్తి