పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ప్రకాష్ నగర్లో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి జూనియర్ లైన్ మెన్ మృతి చెందారు. నిడదవోలు మండలం తీపర్రుకు చెందిన దుర్గారావు నరసాపురంలో జూనియర్ లైన్ మెన్‌గా పనిచేస్తున్నారు.
విధి నిర్వహణలో విద్యుదాఘాతం.. లైన్మెన్ మృతి - latest narasapuram news
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ప్రకాష్ నగర్లో విధులు నిర్వహిస్తున్న జూనియర్ లైన్మెన్ విద్యుదాఘాతంతో మృతిచెందారు. విద్యుత్ స్తంభంపై మరమ్మతులు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.
విధి నిర్వహిస్తూ విద్యుదాఘాతంతో జూనియర్ లైన్ మెన్ మృతి
సోమవారం రాత్రి విధుల్లో భాగంగా విద్యుత్ స్తంభంపై మరమ్మతులు చేస్తున్న సమయంలో విద్యుత్ షాక్‌కు గురై దుర్గారావు మృతి చెందారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మృత దేహాన్ని నరసాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడు దుర్గారావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఇది చదవండిమన్యంలో ప్రశాంతంగా బంద్