పశ్చిమ గోదావరి జిల్లాలో జనతా కర్ఫ్యూకు ప్రజల నుంచి పూర్తి మద్దతు లభించింది. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఏలూరు నగరంలో రహదారులు, ప్రధాన కూడళ్లు నిర్మానుష్యంగా మారాయి. జిల్లాలో భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు, నరసాపురం పట్టణాల్లో సైతం జనతా కర్ఫ్యూతో రహదారులు, వీధులు, కూడళ్లు బోసిపోయాయి. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. వాణిజ్య సముదాయాలు, దుకాణాలను మూసివేశారు.
కాలు బయటపెట్టని జనం... కర్ఫ్యూ విజయవంతం - పశ్చిమ గోదావరి జిల్లాలో జనతా కర్ఫ్యూ
పశ్చిమగోదావరిలో జనతా కర్ఫ్యూ విజయవంతమైంది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేదు. నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారులు ఇవాళ జనం లేక వెలవెలబోయాయి.
eluru