జంగారెడ్డిగూడెంలో ఇసుక తరలింపుపై చర్యలు తీసుకోండి..! - illeigal sand trafsfer in west godavari
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఇసుక అక్రమంగా తరలిస్తున్నా అధికారులెవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. మైసన్నగూడెం, లక్కవరం, పంగిడిగూడెం, తాడ్వాయి, వేగవరం తదితర పంచాయతీల్లో కొందరు అర్ధరాత్రుల్లో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని ఆరోపించారు. ర్యాంపుల వద్ద అధికారుల నిఘా లేకపోవడం వల్లే ఇలా జరుగుతోందని గ్రామస్థులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
జంగారెడ్డిగూడెంలో అక్రమ ఇసుక తరలింపుపై చర్యలు తీసుకోండి!
Last Updated : Feb 25, 2020, 11:54 PM IST