పశ్చిమగోదావరి జిల్లా పెదతాడేపల్లి భారతీయ విద్యాభవన్ వద్ద అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతపల్లికి చెందిన నుదురుమాటి కొండలరావు ఇంటి, గోడౌన్ నుంచి అక్రమంగా రేషన్ బియ్యం ఓ రైస్ మిల్లుకు తరలిస్తున్నట్లు.. లారీ డ్రైవర్ గంజి సుబ్బారావు వీఆర్వో సీతకు సమాచారం అందించాడు. ఈ విషయాన్ని ఆమె రూరల్ పోలీసులకు, డీప్యూటీ తహసీల్దార్‌కు తెలియజేశారు. వారు ఆ లారీని అడ్డుకుని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. నుదురుమాటి కొండలరావు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తూ.. రెండు లారీలతో ఇటీవలే కొవ్వురు సమీపంలో విజిలెన్స్ అధికారులకు చిక్కాడు. పలుమార్లు పట్టుబడిన కొండలరావుపై తక్షణమే పీడీ యాక్ట్ నమోదు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
లారీ డ్రైవర్ సమాచారంతో.. రేషన్ బియ్యం పట్టివేత - పెదతాడేపల్లిలో అక్రమ రేషన్ బియ్యం కేసు
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లిలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. లారీ డ్రైవరే సమాచారం ఇవ్వటంతో.. పోలీసులు వాహనంతో పాటు అందులోని సరుకును స్వాధీనం చేసుకున్నారు.
అక్రమ రేషన్ బియ్యం