25 మంది ఎంపీలను ఇస్తే.. ప్రత్యేక హోదా సాధిస్తామన్న జగన్... ఇప్పుడు ఏం చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ప్రశ్నించారు. తూర్పు గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో పార్టీ జిల్లా సమావేశానికి హాజరయ్యారు. ప్రజలు నమ్మి వైకాపాకు అధికారాన్ని కట్టబెడితే వారి నమ్మకాన్ని వమ్ము చేశారని మండిపడ్డారు. కేంద్రం బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం చేస్తే.. కనీసం మాట్లాడలేని స్థితిలో ఉన్నారని ఆక్షేపించారు. జగన్ సొంత చిన్నాన్న కుమార్తెకే ప్రభుత్వంపై నమ్మకం లేకుండా పోయిందన్నారు. గ్రామ సచివాలయాలకు పార్టీ రంగులు వేయించి 14 వందల కోట్లు వృథా చేశారని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్ట్, పెట్రో కారిడార్ కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
'అధికారం ఇచ్చినందుకు నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు' - పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ న్యూస్
ప్రజలు నమ్మి వైకాపాకు అధికారం కట్టబెడితే.. వారి నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారని రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ మండిపడ్డారు. 25 మంది ఎంపీలను ఇస్తే.. కేంద్రం మెడలు వంచి ప్రత్యేకహోదా సాధిస్తామన్న జగన్... ఇప్పుడు 22 ఎంపీలతో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్