తెదేపా కోసం నిరంతరం పనిచేస్తానని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని తెదేపా కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. సామాజిక మాధ్యమాల్లో పార్టీ మారతానని జరుగుతున్న ప్రచారం అసత్యమని...వాటిని నమ్మవద్దన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అయిదేళ్లపాటు పసుపు చొక్కా వేసుకుని తిరిగిన ఏకైక వ్యక్తిగా తాను గుర్తింపు పొందానన్నారు. సంకల్ప బలంగా వచ్చే 5 ఏళ్లు కష్టపడదామని శ్రేణులకు పిలుపునిచ్చారు. తనను తిరిగి ఎన్నుకున్న నియోజక వర్గ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు.
'పసుపు చొక్కాతో ప్రచారం చేసి గెలిచా పార్టీ మారతానా?' - nimmala rama naidu
రాష్ట్రం మొత్తంలో అయిదేళ్ల పాటు పసుపు చొక్కా వేసుకుని ప్రచారం చేసిన వ్యక్తినని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజాసమస్యలపై పోరాడతానని తెలిపారు. తనపై సామాజిక మాధ్యమాల్లో వస్తోన్న అసత్య ప్రచారాలను నమ్మవద్దన్నారు.
తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు