పేదలకు సొంతింటి కల నిజం చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి అన్నారు. ఎన్ని అవాంతరాలు కల్పించినా ఇళ్ల విషయంలో ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు వెళుతోందని తెలిపారు. దెందులూరు మండలం శ్రీరామవరం, మలకచర్ల, ముప్పవరం, చల్ల చింతలపూడి, పెరుగుగూడెం గ్రామాల్లో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఉగాది నాటికి లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
'అవాంతరాలు కల్పించినా ఇళ్ల పట్టాల పంపిణీ ఆగదు' - దెందులూరు వార్తలు
ఎన్ని అవాంతరాలు కల్పించినా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఆగదని పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి స్పష్టం చేశారు. దెందులూరు మండలం శ్రీరామవరం, మలకచర్ల, ముప్పవరం, చల్ల చింతలపూడి, పెరుగుగూడెం గ్రామాల్లో పట్టాలు పంపిణీ చేశారు. ఉగాది నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు.
ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి