రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు పశ్చిమ గోదావరి జిల్లాలో జలాశయాలు, ప్రధాన కాలువలు పొంగిపొర్లుతున్నాయి. ప్రధానంగా ఎర్రకాలువ ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో ఆ ప్రభావం... అనుసంధానంగా ప్రవహిస్తున్న కాలువలపై పడుతోంది. ఎర్రకాలువ ఉద్ధృతి పెరిగి... తణుకు మండలం దువ్వ వద్ద వయ్యేరు కాలువ ప్రవాహం మరింత పెరిగింది.
ఫలితంగా పక్కనే ఉన్న నివాస గృహాలు, గుడిసెలు నీట మునిగాయి. 43 బాధిత కుటుంబాలకు చెందిన సుమారు 150 మందిని రెవెన్యూ అధికారులు సమీపంలోని పునరావాస కేంద్రానికి తరలించారు. వయ్యేరు గట్టు వెంబడి రాకపోకలు నియంత్రించారు. రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తమై ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని సమీక్షిస్తున్నారు.