పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం సత్యనారాయణపురం గ్రామాన్ని వరద నీరు చుట్టుముట్టింది. గుండేరు డ్రైన్ లో నీటి ప్రవాహం పెరగింది. వరద.. ముంపు ప్రాంతాల్లో ఇళ్లలోకి చేరుతోంది.
పంటపొలాలు నీటమునిగాయి. గ్రామంలో నీట మునిగిన పొలాలను వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించారు. వర్షాల ప్రభావంతో... మండలంలోని కొవ్వలి, మొండికొడు డ్రైన్లు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.