పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో గోదావరి వరద పోటెత్తుతోంది. వరద ఉద్దృతి ఎక్కువగా ఉన్నందున... పాత పోలవరంలోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో పాత పోలవరం వద్ద గట్టుకు గండి పడి... నీరు గ్రామంలోకి ప్రవేశించింది.
కమ్మరగూడెం, నూతనగూడెం వద్ద నెక్లెస్ బండ్ గట్టు బలహీనంగా ఉండటంతో... అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు. పాత పోలవరం వద్ద పరిస్థితి ప్రమాదకరంగా మారింది. వరద నీటిని నిలువరించేందుకు ఇసుక బస్తాలు వేస్తున్నారు.