పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ నుంచి కొవిడ్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులతో ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని... వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. కొవిడ్ ఆస్పత్రుల్లో భోజనం నాణ్యతగా ఉండటం లేదని.. కనీసం దుప్పట్లు సరిగా లేవని కొందరు బాధితులు ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నానికి ఫిర్యాదు చేశారు.
'కొవిడ్ ఆస్పత్రుల్లో రోగులు ఇబ్బందులు ఎదుర్కొకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. ఎలాంటి సమస్య ఉన్నా 18002331077 కు ఫిర్యాదు చేయండి. రోజుకు ఒక్కొక్కరికి 500 రూపాయలు వెచ్చించి ప్రతీ పాజిటివ్ వ్యక్తికి పౌష్టికాహారం అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. క్వారంటైన్ సెంటర్లలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చాం.'- మంత్రి ఆళ్ల నాని