పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు గ్రామీణ మండలం సోమవరప్పాడులో రూ. 14 లక్షల రూపాయల విలువ చేసే గుట్కా, కైనీ బస్తాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ ఇంట్లో భారీ ఎత్తున బస్తాలు నిల్వ ఉంచారన్న సమాచారంతో ఏలూరు డీఎస్పీ దిలీప్ కిరణ్ ఆధ్వర్యంలో తనిఖీలు చేప్టటారు.
ఈ తనిఖీల్లో భారీగా గుట్కా, కైనీ పాకెట్ల బస్తాలు వెలుగుచూశాయి. వీటి విలువ సుమారు రూ.14 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.