ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 15, 2022, 3:34 PM IST

Updated : Mar 15, 2022, 4:50 PM IST

ETV Bharat / state

నాటుసారా మరణాలపై స్పందించిన ప్రభుత్వం.. సారా అక్రమ నిల్వదారులపై కేసులు

సారా అక్రమ నిల్వదారులపై కేసులు
సారా అక్రమ నిల్వదారులపై కేసులు

15:32 March 15

నాటుసారా మరణాలపై స్పందించిన ప్రభుత్వం

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం నాటుసారా మరణాలపై... ప్రభుత్వం స్పందించింది. బాధితుల ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. నాటుసారా.. అక్రమ నిల్వదారులపై పలు సెక్షన్ల కింద 10 కేసులు నమోదు చేసింది. నాటుసారా మరణాలను 'ఈటీవీ ఆంధ్రప్రదేశ్‌', 'ఈనాడు', 'ఈటీవీ భారత్'​ సంయుక‌్తంగా వెలుగులోకి తెచ్చాయి. ఈ వ్యవహారంపై రాజకీయ దుమారం రేగడంతో.. అధికారులు కేసులు నమోదు చేశారు.

ఈ మేరకు జంగారెడ్డిగూడెంలో 22 మంది నాటుసారా తయారీదారులు, విక్రేతలను సెబ్ అధికారులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 18 వేల లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. సహజ మరణాలైతే దాడులు, కేసులు ఎందుకని ఈ సందర్భంగా సెబ్ అధికారులను ఐద్వా మహిళలు ప్రశ్నించారు.

రూ.కోటి పరిహారం ఇవ్వాలి..

ఎన్నికల్లో మద్యపాన నిషేధం అమలు చేస్తామని చెప్పిన వైకాపా పాలనలో రాష్ట్రంలో మద్యం, నాటుసారా ఏరులై పారుతోందని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. కల్తీసారాను స్వయంగా వైకాపా నేతలే విక్రయిస్తున్నారన్నారని ఆయన ఆరోపించారు. పక్క రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చి ఇక్కడ అధిక ధరకు విక్రయిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో సోమవారం పర్యటించిన చంద్రబాబు.. కల్తీ మద్యం తాగి మృతిచెందిన వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. అనంతరం వారితో ముఖాముఖి మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

"మద్యం, నాటుసారా ఏరులై పారుతోంది. కల్తీసారా వైకాపా నాయకులే విక్రయిస్తున్నారు. మద్యం తయారీ నుంచి విక్రయం వరకు జగన్ చేస్తున్నారు. తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. కల్తీ నాటుసారాతో చనిపోయిన వారిని సహజ మరణాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ప్రకటన చేయటం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. ప్రభుత్వ అక్రమ నాటుసారా, మద్యం వ్యాపారం వల్లే 36 మంది బలయ్యారు. కల్తీ సారా నియంత్రించే వరకు పోరాటం చేపడతా. ఎందరిని జైలులో పెట్టినా కేసులకు భయపడం. బాధిత కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి. - చంద్రబాబు, తెదేపా అధినేత "

ఇదీ చదవండి

కల్తీసారా విక్రేతలు వైకాపా నాయకులే.. మృతుల కుటుంబాలకు కోటి పరిహారం ఇవ్వాలి: చంద్రబాబు

Last Updated : Mar 15, 2022, 4:50 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details