పశ్చిమగోదావరి జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో మార్చి నెలాఖరులోగా కుళాయి ఏర్పాటు పూర్తి చేసే దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో 48 మండలాల్లో 10 వందల 72 పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో జల జీవన్ పథకం ద్వారా సుమారు 4 లక్షల 47 వేల ఇళ్లకు కుళాయిలు ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం.
మార్చి నెలాఖరులోగా ఇంటింటికి కుళాయి - ఇంటింటికి నీటి కుళాయి పథకం తాజా సమాచారం
పశ్చిమగోదావరిలో మార్చి నెలాఖరులోగా కుళాయి ఏర్పాటు పనులు పూర్తి చేసే లక్ష్యంతో అధికారులు అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు టెండర్లు పూర్తి చేసి సాధ్యమైనంత త్వరగా పనులు ప్రారంభిస్తామని అధికారులు వివరించారు. ఈ పనుల కోసం ప్రభుత్వం 407 కోట్ల రూపాయలు మంజూరు చేసింది.
మార్చి నెలాఖరులోగా ఇంటింటికి కుళాయి
ప్రభుత్వం ఇప్పటికే సర్వే ద్వారా కుళాయి లేని వారిని గుర్తించింది. అలాగే కనెక్షన్ అవసరమైన వారు గ్రామ కార్యదర్శి ఇంజనీరింగ్ సహాయకులు గ్రామ వాలంటీర్లకు దరఖాస్తును చేయవచ్చని తెలియజేసింది. మార్చి నెలాఖరు నాటికి ఇంటింటికి కుళాయిలు ఇవ్వాలనే లక్ష్యంతో టెండర్లు పూర్తి చేసి సాధ్యమైనంత త్వరగా పనులు ప్రారంభిస్తామని ఆ శాఖ అధికారులు వివరించారు.
ఇదీ చదవండీ...కడపలో కేంద్ర బృందం పర్యటన.. నివర్ తుపాను నష్టంపై ఆరా