పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం అజ్జరంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. వివాహ విందు వద్ద తలెత్తిన చిన్న గొడవ కొట్లాటకు దారితీసింది. పెళ్లి పూర్తయిన తర్వాత వధూవరుల తరఫు బంధువులు భోజనాలు చేస్తుండగా వాగ్వాదం మొదలైంది. అది చిలికిచిలికి గాలివానగా మారి ఇరువర్గాల వారు కొట్లాటకు దిగారు. ఈ ఘటనలో 12 మంది గాయ పడ్డారు. క్షతగాత్రులను తణుకు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వివాహ విందులో కొట్లాట.. 12 మందికి గాయాలు - 12
వివాహ విందులో మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. పెళ్లి భోజనాలు చేస్తుండగా మొదలైన గొడవలో 12 మంది గాయ పడ్డారు.
వివాహవిందులో కొట్లాట.. 12 మందికి గాయాలు