పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో లారీలో తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. విశాఖపట్నం నుంచి వస్తున్న లారీని విశ్వసనీయ సమాచారం మేరకు తనిఖీ చేశారు. సుమారు 205 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా లారీ క్యాబిన్ కింద.. బాడీకి మధ్యలో అరలుగా చేసి గంజాయి తరలిస్తున్నారు. ఇనుపఅరలను పగలగొట్టి 104 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
భారీగా గంజాయి పట్టివేత - jeelugumilli
జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో లారీలో తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నారు.
గంజాయి పట్టివేత