గోదావరికి మరోమారు వరద ముంచుకురావడం వల్ల పోలవరం మండలంలోని ముంపు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గత వారం గోదావరి నదికి వరద తాకిడితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు.
మరోసారి అదే పరిస్థితితో ఇప్పటికే 19 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద తీవ్రత పెరిగే సూచనతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పోలవరం గ్రామ సమీపంలో బలహీనంగా ఉన్న నెక్లెస్ బాండ్‌ను అధికారులు పటిష్ఠ పరుస్తున్నారు.