బడేటి బుజ్జి అనుచరులపై వైకాపా కార్యకర్తల దాడి - badeti babji
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే బడేటి బుజ్జి అనుచరులపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘర్షణలో ఆయన స్నేహితుడు కంప్యూటర్ ప్రసాద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను ఏలూరు ఆస్పత్రికి తరలించారు.
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే బడేటి బుజ్జి అనుచరులపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఉదయం డబ్బుల పంపకం జరుగుతోందన్న సమాచారం మేరకు... శనివారం పేట ఇందిరా కాలనీలో పోలింగ్ కేంద్రం దగ్గరకు ఎమ్మెల్యే బుజ్జి వెళ్లారు. ఒక్కసారిగా తరుముకొచ్చిన 300 మంది వైకాపా కార్యకర్తలు ఎమ్మెల్యే బడేటి బుజ్జి అనుచరులపైన దాడి చేశారు. ఈ ఘర్షణలో ఎమ్మెల్యే కిందపడిపోయారు. స్వల్ప గాయాలయ్యాయి. ఆయన స్నేహితుడు కంప్యూటర్ ప్రసాద్‌కు తీవ్ర గాయాలు కావడంతో ఏలూరు ఆస్పత్రికి తరలించారు.