రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పార్లమెంటులో చర్చించి చట్టాలు చేయాలని అఖిల పక్ష రైతు సంఘాల సమన్యయ కమిటీ డిమాండ్ చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆ సంఘ నాయకులు మాట్లాడుతూ శ్రమించి పంటలు పండిస్తున్న రైతాంగం గిట్టుబాటు ధర లేక పెట్టిన పెట్టుబడులు రాక దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన చెందారు. ప్రభుత్వం పథకాలు ప్రకటిస్తున్నా... సమస్యలు మాత్రం పరిష్కరించడం లేదని ఆరోపించారు. సమస్యలు తీరేలా పార్లమెంటులో చట్టాలు చేయాలన్నారు.
''రైతుల సమస్యలు తీరేలా చట్టాలు చేయండి'' - పశ్చిమ గోదావరి జిల్లా
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద అఖిలపక్ష రైతు సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేశారు.
రైతుల సబ్ కలెక్టర్ ధర్నా...