ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వరిచేలు అడుగుతున్నాయి... నీరు వచ్చే దారేదని - westgodavari district latestnews

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు, దెందులూరు మండలంలోని గ్రామాల్లో సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కాలువ పక్కన ఉన్న మేరక భూములతో పాటు శివారు భూములకు సాగునీరు అందడంలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.

Farmers facing difficulties in irrigating
సాగునీరు లేక అన్నదాతల ఆందోళన

By

Published : Feb 26, 2021, 3:25 PM IST

సాగునీరు లేక అన్నదాతల ఆందోళన
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు, దెందులూరు మండలంలోని గ్రామాల్లో సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గుండుగొలను ఇరిగేషన్ సెక్షన్ పరిధిలోని దెందులూరు, ఏలూరు గ్రామీణ మండలాల్లో గోదావరి ఏలూరు కాలువ కింద సుమారు 12వేల ఎకరాల్లో రబీ నాట్లు వేశారు. కాలువ పక్కన ఉన్న మేరక భూములతో పాటు శివారు భూములకు సాగునీరు అందడంలేదు.

కొవ్వలిలోని జిల్లేడుదిబ్బ ప్రాంతంలో పొలాలు బీటలు వారి వాడిపోతున్నాయి. ఎండిపోయిన పొలాల్లో మట్టి గడ్డలు తీసి రైతులు చూపుతున్నారు. ఈ ప్రాంతానికి కాలువనీరు వచ్చి సుమారు నెల రోజులు అవుతుందన్నారు. వంతుల వారి విధానంలోనూ సాగునీరు పొలాలకు చేరడం లేదన్నారు. ప్రస్తుతం పలుచోట్ల పొట్ట దశలో ఉన్నాయని.. బీటలు వారడం బాధాకరమని రైతులు వాపోతున్నారు. గోదావరిలో నీటి లభ్యత తక్కువగా ఉందని.. అందుకే నీరు తక్కువ విడుదల చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.

ఇదీ చూడండి.:' శంకర్ విలాస్ వంతెనను పొడగించండి'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details