పింఛన్‌లో నకిలీ నోట్ల పంపిణీ ముఠా అరెస్ట్ - koida village
ప.గో జిల్లా కొయిదాలో వృద్ధుల పించన్ డబ్బుల్లో నకిలీ నోట్లను ఉంచి పంపిణీ చేసిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. భారీగా నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడు మండలం కొయిదాలో.. వృద్ధులకు ఫించన్ల సొమ్ములో నకిలీ నోట్లు ఉంచి పంపిణీ చేసిన కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో గ్రామ కార్యదర్శి పాతయ్య సహా మరో ఐదుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 26.5లక్షల విలువచేసే 2 వేలు, ఐదు వందల నకిలీనోట్లను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ నోట్లను మార్పిడి చేసేందుకు.. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఐదుగురు వ్యక్తులు.. గ్రామకార్యదర్శి తో అవగాహన కుదుర్చుకున్నారని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో వృద్ధులకు ఇచ్చే పింఛన్‌లో ఆ నకిలీ నోట్లను ఉంచి పంపిణీ చేస్తున్నారని పేర్కొన్నారు.