ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చాకెట్లు తిన్న బాలుడి మృతి... ఇంతకీ ఏం జరిగిందంటే ? - sick

అభిచరణ్‌ చాక్లెట్లు తిన్నాడు... పక్కనే ఆడుకుంటున్న తోటి స్నేహితులకూ ఇచ్చాడు. ఇస్తూనే... అతను అస్వస్థతకు గురయ్యాడు. మిగిలిన ఇద్దరిదీ అదే పరిస్థితి... అసుపత్రికి తీసుకెళ్లేసరికి నష్టం జరిగిపోయింది

chocolate

By

Published : Jul 15, 2019, 4:10 PM IST

చాకెట్లు తిన్న బాలుడి మృతి... ఇంతకీ ఏం జరిగిందంటే ?
పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం రావిగూడెంలో దారుణం జరిగింది. నిల్వ ఉన్న చాక్లెట్లు తిని ముగ్గురు చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో అభిచరణ్ ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. కట్ట సంతోష్, మడకం రాహుల్ జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిద్దరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఆదివారం సాయంత్రం ఆడుకంటూ ఇంటికెళ్లిన అభిచరణ్‌ చాక్లైట్లు తిన్నాడు. మరో రెండు తీసుకొచ్చి ఇద్దరి స్నేహితులకు ఇచ్చాడు. అప్పటికే ఎక్కువగా తిన్నా చరణ్ వాంతులు చేసుకుంటూ అక్కడ పడిపోయాడు. ముగ్గుర్నీ బుట్టాయిగూడెం మండలం నందపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తరలించారు. తర్వాత ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ అభిచరణ్‌ చనిపోయాడు.

ఈ సంఘటనపై కేసు నమోదు చేసి బుట్టాయిగూడెం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కోలుకుంటున్న చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని టూ పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు వైద్యులు కోరారు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details