ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుకు కరోనా

భాజపా నేత పైడికొండల మాణిక్యాలరావుకు కరోనా పాజిటివ్​గా నిర్దరణ అయ్యింది. తన స్నేహితుని ద్వారా తనకు కరోనా సోకిందని.. స్వయానా ఆయనే వీడియో విడుదల చేశారు. వైరస్​ సోకితే భయపడవలసిన అవసరం లేదని.. భౌతిక దూరం, మాస్కులు ధరించాలని సూచించారు.

మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుకు కరోనా
మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుకు కరోనా

By

Published : Jul 4, 2020, 11:04 AM IST

మాజీ మంత్రి, భాజపా నేత పైడికొండల మాణిక్యాలరావుకు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన వీడియో ద్వారా స్పష్టం చేశారు. తన మిత్రుని ద్వారా తనకు వైరస్​ సోకిందని.. తన కుటుంబ సభ్యులు ఎవరికీ కొవిడ్​ సోకలేదని తెలిపారు.

నాకు కరోనా పాజిటివ్​గా నిర్ధారణయ్యింది. కరోనా సోకితే భయపడవలసిన అవసరం లేదు. వైరస్​ సోకకుండా.. భౌతిక దూరం పాటించి.. మాస్క్​ ధరించాలని సూచించారు. వీలైనంత వరకూ కారులో ప్రయాణించవద్దని అన్నారు.

- పైడికొండల మాణిక్యాలరావు

ఇదీ చూడండి..

ఇంత తక్కువ సమయంలో కరోనా టీకా ఎలా సాధ్యం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details