ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆరోపణలు రుజువు చేస్తే రాజకీయ సన్యాసం చేస్తా'

తాడేపల్లిగూడెం శాసనసభ్యుడు కొట్టు సత్యనారాయణ తనపై చేసిన వ్యాఖ్యలపై పైడికొండల మాణిక్యాలరావు స్పందించారు.

By

Published : Aug 23, 2019, 9:12 PM IST

మాణిక్యాలరావు

పార్టీలు మారే ఆనవాయితీ నాకు లేదు

తన రాజకీయ జీవితం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు ఒకే పార్టీలో ఉన్నానని భాజపా నేత పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ఇప్పటివరకు ఐదు పార్టీలు మారారని... భవిష్యత్తులో వైకాపాలో కొనసాగుతారో లేదో కూడా తెలియదని ఎద్దేవా చేశారు. 2014 ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే రాష్ట్రం అదోగతి అవుతుందని విమర్శించారని గుర్తు చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో అదే పరిస్థితి కొనసాగుతుందని తెలిపారు. జగన్ విమర్శించిన వ్యక్తి ఇప్పుడు జగన్కు అంగరక్షకుడుగా ఉంటున్నారంటే ప్రజలు నవ్వుకుంటారని విమర్శించారు. అమ్మ, నాన్నను ఎలాగైతే మరిచిపోమో.. జీవితాన్ని ఇచ్చిన వృత్తిని కూడా మర్చిపోకూడదని పలికారు.

తిరుమల తిరుపతికి రాకపోకలు సాగించే బస్సులపై క్రైస్తవ మత ప్రచార బ్యానర్లు ఉండటాన్ని తప్పుపట్టారు. గత ప్రభుత్వం కారణంగానే ఇలా జరిగిందని అని చెప్పడం అవివేకం అన్నారు. ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారని ఆరోపించారు. తాను దేవాదాయశాఖ భూములను అన్యాక్రాంతం చేసినట్లు రుజువు చేస్తే రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ విసిరారు. ఆరోపణలను రుజువు చేయని పక్షంలో ఎమ్మెల్యే రాజకీయ సన్యాసం చేస్తారా అని ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details