దిల్లీలో ఉన్నట్లే పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు వంగాయగూడెం సెంటర్‌లోనూ ఓ పార్లమెంటుంది. కానీ ఇక్కడ సభ జరగదు. విజ్ఞానాన్ని అందిస్తుంది. గతంలో ఈ స్థలంలో చెత్త పోసేవారు. దీంతో నలుగురికి పనికొచ్చే ఏదైనా కట్టడం ఇక్కడ నిర్మించాలని తలచారు. అమరావతి ధ్యాన బుద్ధ రూపశిల్పి రేగుళ్ల మల్లికార్జునరావు.. అంబేడ్కర్ విగ్రహాన్ని నిర్మించాలని నిర్ణయించారు. అంబేడ్కర్ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించిన 9 ప్రదేశాల్లో ఏలూరు ఒకటి. ఆయన ఏలూరు వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్లమెంటు ఆకారంలో తక్కువ స్థలంలో భవనాన్ని నిర్మించి, దానిపై 13 అడుగుల అంబేడ్కర్ కాంస్య విగ్రహాన్ని, వెనుక అశోక చక్రాన్ని ఏర్పాటు చేశారు. అభయ ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో రూ.30 లక్షలతో దీనిని పూర్తిచేశారు. భవనం లోపల అంబేడ్కర్ చిత్రాలు, ఆయన రాసిన పుస్తకాలు, వివిధ రకాల పుస్తకాలతో గ్రంథాలయం ఏర్పాటు చేశారు.
ఏలూరులోనూ ఓ పార్లమెంటుంది.. మీరు చూశారా? - eluru updates
అదేంటి పార్లమెంట్ దిల్లీలో ఉంది కదా! ఏలూరులో అంటున్నారేంటీ అనుకుంటున్నారా? మీరు చెప్పింది కరెక్టే పార్లమెంట్ దేశ రాజధానిలోనే ఉంది. అయితే పార్లమెంట్ భవనాన్ని పోలిన ఓ భవనం ఏలూరులో దర్శనమిస్తోంది. అమరావతి ధ్యాన బుద్ధ రూపశిల్పి రేగుళ్ల మల్లికార్జునరావు.. అంబేడ్కర్ విగ్రహాన్ని నిర్మించాలని నిర్ణయించారు. భవనంపైన అంబేడ్కర్ విగ్రహాన్ని నిర్మించి.. గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు.
eluru parlament building