పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తైంది. మొత్తం 50 డివిజన్లలో 47 డివిజన్లు వైకాపా, 3 డివిజన్లలో తెదేపా విజయం సాధించింది. మార్చి 10న 47 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. వైకాపా 47, తెదేపా 43, జనసేన 19, భాజపా 14, స్వతంత్రులు 39 స్థానాల్లో పోటీ పడ్డారు. . 2, 4, 5, 10, 11, 17, 18, 21, 22, 23, 24, 25, 26, 31, 33, 36, 38, 39, 40, 41, 42, 43, 45, 46, 48, 49, 50 సహా మరికొన్ని డివిజన్లలో వైకాపా.. 28, 37, 47 డివిజన్లలో తెదేపా అభ్యర్థులు విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు దాదాపుగా పూర్తయింది. 14, 16 డివిజన్ల ఫలితాలు మాత్రమే ఇంకా వెల్లడికావాల్సి ఉంది. గతంలో ఏకగ్రీవమైన మూడు స్థానాలూ వైకాపా ఖాతాలోనే ఉన్నాయి. దీంతో ఇప్పటి వరకు ఆ పార్టీ 45 డివిజన్లలో గెలుపొందినట్లయింది.
వైకాపా విజయం..
2వ డివిజన్‌లో 730 ఓట్ల మెజార్టీతో వైకాపా అభ్యర్థి కనక నరసింహారావు గెలుపొందారు. 4వ డివిజన్‌లో 744 ఓట్ల మెజార్టీతో వైకాపా అభ్యర్థి డింపుల్ , 6 వ డివిజన్‌వో 753 ఓట్ల మెజార్టీతో వైకాపా అభ్యర్థి సుంకర చంద్రశేఖర్ , 8 వ డివిజన్‌లో 28 ఓట్ల మెజార్టీతో వైకాపా అభ్యర్థి ప్రవీణ్ కుమార్, 9వ డివిజన్‌లో 534 ఓట్ల మెజార్టీతో వైకాపా అభ్యర్థి సబ్బన శ్రీనివాస్, 12వ డివిజన్‌లో 468 ఓట్ల మెజార్టీతో కర్రి శ్రీను, 13 వ డివిజన్‌లో 1339 ఓట్ల మెజార్టీతో వైకాపా అభ్యర్థి అన్నపూర్ణ, 17వ డివిజన్‌లో 1,410 ఓట్ల మెజార్టీతో వైకాపా అభ్యర్థి పద్మ, 18వ డివిజన్‌లో 1,012 ఓట్ల మెజార్టీతో వైకాపా అభ్యర్థి కేదారేశ్వరి, 20 వ డివిజన్‌లో 432 ఓట్ల మెజార్టీతో వైకాపా అభ్యర్థి ఆదిలక్ష్మీ , 21 వ డివిజన్‌లో 836 ఓట్ల మెజార్టీతో వైకాపా అభ్య అన్నపనేని భారతి, 22వ డివిజన్‌లో 468 ఓట్ల మెజార్టీతో వైకాపా అభ్యర్థి సుధీర్‌బాబు, 23వ డివిజన్‌లో 1,823 ఓట్ల మెజార్టీతో వైకాపా అభ్యర్థి సాంబ, 24వ డివిజన్‌లో 853 ఓట్ల మెజార్టీతో వైకాపా అభ్యర్థి మాధురి , 25వ డివిజన్‌లో 724 ఓట్ల మెజార్టీతో వైకాపా అభ్యర్థి శ్రీనివాస్, 26వ డివిజన్‌లో 1,111 ఓట్ల మెజార్టీతో వైకాపా అభ్యర్థి అద్దంకి హరిబాబు, 31వ డివిజన్‌లో 471 ఓట్ల మెజార్టీతో వైకాపా అభ్యర్థి లక్ష్మణ్, 33వ డివిజన్‌లో 88 ఓట్ల మెజార్టీతో వైకాపా అభ్యర్థి రామ మోహన్ , 35 వ డివిజన్‌లో 724 ఓట్ల మెజార్టీతో వైకాపా అభ్యర్థి గుడిదేశి శ్రీనివాస్ ,38వ డివిజన్‌లో వైకాపా అభ్యర్థి హేమమాధురి, 39వ డివిజన్‌లో వైకాపా అభ్యర్థి జ్యోతి, 40వ డివిజన్‌లో 758 ఓట్ల మెజార్టీతో వైకాపా అభ్యర్థి స్రవంతి , 41వ డివిజన్‌లో వైకాపా అభ్యర్థి కల్యాణిదేవి, 42వ డివిజన్‌లో వైకాపా అభ్యర్థి సత్యవతి, 44వ డివిజన్‌లో వైకాపా అభ్యర్థి పొలిమేర దాసు, 45వ డివిజన్‌లో 1,058 ఓట్ల మెజారిటీతో వైకాపా అభ్యర్థి చంద్రశేఖర్, 46వ డివిజన్‌లో వైకాపా అభ్యర్థి ప్యారీ బేగం, 48వ డివిజన్‌లో 483 ఓట్ల మెజార్టీతో వైకాపా అభ్యర్థి స్వాతి శ్రీదేవి, 50వ డివిజన్‌లో 1,495 ఓట్ల మెజార్టీతో షేక్ నూర్జహాన్ విజయం సాధించారు.
45వ డివిజన్ వీరిలో వైకాపా అభ్యర్థి ప్రతాపచంద్ర ముఖర్జీ కొద్దిరోజుల క్రితం కొవిడ్‌తో మృతి చెందారు.
తెదేపా విజయం
37వ వార్డులో 150 ఓట్ల మెజార్టీతో తెదేపా అభ్యర్థి పృథ్వీ శారద విజయం సాధించారు. 47వ డివిజన్‌లో 55 ఓట్ల మెజార్టీతో తెదేపా అభ్యర్థి దుర్గా భవాని గెలుపొందారు.
15వ డివిజన్‌లో సీపీఐ అభ్యర్థి కన్నబాబు రంగా 94 ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నారు. అంతకుముందు పోస్టల్ బ్యాలెట్ ఓట్లలోనూ వైకాపా ఆధిక్యం ప్రదర్శించింది. పోస్టల్ బ్యాలెట్‌లో మొత్తం 15 ఓట్లు పోలవగా.. అందులో వైకాపా 11, తెదేపా, నోటాకు ఒక్కో ఓటు వచ్చాయి. మరో 2 ఓట్లు చెల్లలేదు.