పశ్చిమగోదావరి జిల్లాలోని పలు గ్రామాలను మోడల్ విలేజ్ లుగా తీర్చిదిద్దేందుకు... ద్వారకా తిరుమల, ఏలూరు మండలంలోని సత్రంపాడు ,శనివారపుపేట గ్రామాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. మూడు గ్రామాల్లో ప్లాస్టిక్ వాడకం నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యం అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు.. ద్వారకా తిరుమలలో ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ అమల తీరును జాతీయ హరిత ట్రిబ్యునల్ కమిటీ చైర్ పర్సన్ బి.శేషశయనారెడ్డి పరిశీలించారు. ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కొండపైన మొక్కలు నాటారు. అనంతరం.. గ్రామం నడిబొడ్డున ఉన్న చెత్త సంపద కేంద్రాన్ని పరిశీలించారు.
ద్వారకా తిరుమలకు.. ఎన్జీటీ ఛైర్పర్సన్ శేషశయనారెడ్డి - west godavari
పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల క్షేత్రాన్ని జాతీయ హరిత ట్రిబ్యునల్ కమిటీ చైర్ పర్సన్ బి శేషశయనారెడ్డి గురువారం సందర్శించారు. స్వామిని దర్శించుకుని.. కొండపైన మొక్కలు నాటారు.
ఎన్జీటీ