పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం ఏపూరుకు చెందిన... ఏడేళ్ల కిషోర్ అపహరణకు గురయ్యాడు. తమ బిడ్డ కనిపించడం లేదంటూ... బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కృష్ణాజిల్లా నూజివీడుకు చెందిన నాగరాజు, అనసూయ దంపతులు బాలుడిని అపహరించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. టీ.నరసాపురంలో విక్రయించడానికి ప్రయత్నిస్తుండగా... బాలుని వివరాలు పలువురు అడగడంతో భయపడి... తిరిగి గ్రామానికి ఆటోలో పంపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అపహరించిన దంపతులను అరెస్టు చేశారు.
బాలుడి అపహరణ... కథ సుఖాంతం - బాలుడి అదృశ్యం కేసును ఛేదించిన పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు
పశ్చిమగోదావరి జిల్లాలో 2 నెలల కిందట జరిగిన బాలుడి అపహరణ కేసును పోలీసులు చేధించారు. బాలుడిని అపహరించి... విక్రయించే ప్రయత్నం చేస్తున్న దంపతులను ఏలూరు గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు.
రెండు నెలల కిందట బాలుని అపహరణ.... కథ సుఖాంతం