ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 28, 2022, 12:50 PM IST

ETV Bharat / state

Water Problem: జీవనదులు ఉన్నా.. తాగడానికి గుక్కెడు నీరు లేక

drinking water problem: జీవనదులను తనలో ప్రవహింపజేసుకునే ప్రాంతమది... ఎక్కడ చూసినా పుష్కలంగా నీరు కనిపిస్తుంది... అలాంటి చోట జీవిస్తున్న ప్రజలకు తాగడానికి మంచినీరు లభించడం లేదు... దాహార్తి తప్పట్లేదు..! రక్షిత మంచినీటి పథకాలు సహా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నా కరవే..! జిల్లా అంతటా పర్యవేక్షణ లోపమే... గుక్కెడు నీటికోసమూ అవస్థలే... శుద్ధజలం కోసం పొరుగూళ్లకు వెళ్లలేని పరిస్థితి... మురుగునీటితోనే సర్ధుకుంటున్న దీనస్థితి... పల్లె నుంచి పట్నం వరకు అదే గతి... నిధుల విడుదలో ఆలస్యం... ఇలా మంచినీటి కోసం అల్లాడుతున్న పశ్చిమగోదావరి జిల్లాలో తాగునీటి ఎద్దడిపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం...

water problems
తాగు నీటి సమస్యలు

drinking water problem: పశ్చిమగోదావరి జిల్లాలో ఓ వైపు గోదావరి గలగల పారుతోంది.. మరోవైపు ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరు కొలువై ఉంది. ఇంకోవైపు నుంచి కృష్ణా జలాలు సమృద్ధిగా లభ్యమవుతాయి. అయినా.. నీటి సమర్థ వినియోగం, నిధుల విడుదలో జాప్యం, పర్యవేక్షణ లోపం వల్ల ప్రజలకు ఇబ్బందులు తప్పట్లేదు.

48 మండలాలు మంచినీటి కోసం...

తాగు నీటి కోసం ప్రజల ఇబ్బందులు

drinking water problem: వేసవికి ముందే జిల్లాలోని 48 మండలాల్లో గుక్కెడు నీటికోసం ఎదురుచూపులు తప్పడం లేదు. పట్టణ ప్రాంతాల్లో రోజులో 3 గంటలపాటు నీటి సరఫరా చేసేవారు. ప్రస్తుతం గంటన్నర మాత్రమే వదులుతున్నారు. పైపులైన్ల ద్వారా..ముందులాగా 2రోజులకొకసారి కాకుండా...నాలుగురోజులైనా వదలడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లోనూ మూడురోజలకొసారి నీటిని విడుదల చేస్తున్నారు.

"సరిగ్గా నీళ్లుంటూ ఉండవు మాకు. ఎప్పుడూ కరవే. ఎక్కడెక్కడి నుంచో మోసుకుని రావాల్సి వస్తోంది. పిల్లలను ఎత్తుకుని మరీ నీళ్ల కోసం ఎక్కడెక్కడో తిరగాలి. నాలాల ద్వారా వచ్చే నీటిని కూడా మూడు రోజులకు ఒక్కసారే వదులుతారు. అవి కూడా మురికిగానే వస్తాయి. ఒక్క గంటే వదులుతారు." -సింధూ, తిమ్మరాజుగూడెం

తాగునీటి పథకాల పర్యవేక్షణ, మరమ్మతులు సరిగా చేపట్టడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేక తాగునీటి పనులు చేపట్టకపోవడం వల్ల నీటి సరఫరా సరిగా సాగడం లేదు. పట్టణ శివారు ప్రాంతాల ప్రజలు దాహార్తితో అల్లాడుతున్నారు. గ్రామీణ రక్షిత నీటి పథకాలకు ఏటా సుమారు రూ.45 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇంతా చేసినా..ప్రజలు తాగడానికి గుక్కెడు నీరు కరవవుతోంది. డీపీ, పీడబ్ల్యూఎస్, ఎంవీఎస్ నీటి పథకాలు కలిపి సుమారు 3 వేల 200 వరకు ఉన్నాయి. పైపులైన్ల మరమ్మతులు చేయకపోవడం వల్ల తాగునీటి ఇబ్బందులు ఎదురువుతున్నాయి.

"అయిదారడుగుల లోతుల్లో పైపులు ఉంటాయి. పైకి నీరు రావు. ఒక్కో పంపునకు 10 కుటుంబాలు నీళ్లు పట్టాలి. కుటుంబానికి రెండుమూడు బిందెలే అందుతాయి. సరిపోవడం లేదు. అధికారులను అడిగితే చేద్దామంటారే కానీ... పట్టించుకోరు." వంగవీటి రంగా కాంస్య విగ్రహాన్ని

ప్రజలకు తాగునీటిని అందించే బాధ్యత ప్రభుత్వానికి ఉందని... ఆ బాధ్యతను సక్రమంగా అమలు చేసి తమకు తాగునీటిని అందించాలని ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

agricultural power consumption : 2022-23లో వ్యవసాయ విద్యుత్‌ వినియోగం 19,819 ఎంయూలు

ABOUT THE AUTHOR

...view details