పశ్చిమగోదావరిజిల్లా ఉండ్రాజవరం మండలం వడ్లూరు గ్రామంలో పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. నలుగురు పిల్లలతోపాటు ఇద్దరు వ్యక్తులను కరవటంతో బాధితులు తణుకు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రామంలో ఇటీవల కాలంలో కుక్కలు విపరీతంగా పెరిగిపోయాయి. వీధివీధినా కుక్కల దండు కనిపిస్తున్నా పంచాయతీ అధికారులకు పట్టటంలేదు. అధికారులు పట్టించుకోకపోవటంతో ప్రజలు భయందోళన చెందుతున్నారు. బయటికి వెళ్లాలంటానే భయమేస్తోందంటున్నారు. తమను కుక్కల నుంచి రక్షించాలని కోరుతున్నారు.
పిచ్చికుక్క స్వైర విహారం: ఆరుగురికి గాయాలు - dog attack in Vadluru village Undrajavaram west godavari
పిచ్చి కుక్కలు గ్రామస్తులపై దాడులు చేసి గాయపరుస్తున్నా అధికారులకు చీమకుట్టినట్టయినా లేదని పశ్చిమగోదావరిజిల్లా ఉండ్రాజవరం మండలం వడ్లూరు ప్రజలు వాపోతున్నారు. గ్రామంలో కుక్కల దాడి నుంచి తమ పిల్లల ప్రాణాలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికే ఆరుగురిని కరవటంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఆందోళన చెందుతున్నారు.
పిచ్చికుక్క స్వైర విహారం: ఆరుగురికి గాయాలు
ఇవీ చదవండి