ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'దిశ'తో... మృగాళ్లకు 21 రోజుల్లోనే శిక్ష అమలు

మహిళలపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అన్ని జిల్లాల్లో మహిళా మిత్ర సంఘాలను ఏర్పాటు చేసి, పెద్ద ఎత్తున చైతన్యం తెచ్చేందుకు కార్యాచరణను రూపొందించినట్లు జిల్లా ఎస్పీలు స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో దిశ చట్టంపై అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి సుచరిత పాల్గొని సీఎం జగన్​ మహిళలపై నేరం జరిగిన 21 రోజుల్లోనే శిక్షపడేలా చట్టాన్ని రూపొందించారని తెలిపారు.

disha act, Woman Allied Communities and mahila mitra
''దిశ''తో... మృగాళ్లకు 21 రోజుల్లోనే శిక్ష అమలు

By

Published : Dec 15, 2019, 5:41 PM IST

''దిశ''తో... మృగాళ్లకు 21 రోజుల్లోనే శిక్ష అమలు

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో సెయింట్​ ఆన్స్​ విద్యాసంస్థల మైదానంలో దిశ చట్టంపై అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర హోమంత్రి మేకతోటి సుచరిత హాజరయ్యారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళలపై జరుగుతున్న అరాచకాలను అరికట్టేలా దిశ చట్టాన్ని రూపొందించారని తెలిపారు. ఈ చట్టం వల్ల అమ్మాయిలపై అఘాయిత్యాలకు ఒడిగట్టే మృగాళ్లకు 21 రోజుల్లోనే శిక్షలు ఖరారవుతుందని స్పష్టం చేశారు.

మహిళా మిత్రల ఏర్పాటుకు చర్యలు

మహిళలపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టడానికి గ్రామ, వార్డు స్థాయిలో మహిళా మిత్రలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ గ్రావెల్ తెలిపారు. మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. 100 నెంబర్​కు ఫోన్ చేసిన ఏడు నుంచి పది నిమిషాల్లో తన సిబ్బంది అక్కడికి చేరుకుంటారన్నారు . వార్షిక తనిఖీల్లో భాగంగా దెందులూరు పోలీస్​ స్టేషన్​ను తనిఖీ చేసిన ఆయన.. స్టేషన్​లో దస్త్రాల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి:

అందుకే దిశ చట్టాన్ని తీసుకొచ్చాం: హోంమంత్రి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details