'అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం' - పశ్చిమ గోదావరి
అర్హత ఆధారంగా ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతాయని పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అన్నారు.
dhendhuluru_mla_about_govt_scheems
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలంలోని మేదినరావు పాలెం, రామారావు గూడెం గ్రామాల్లో ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పర్యటించారు. పాఠశాల విద్యార్థులకు పుస్తకాలను అందించిన అనంతరం ఆయా గ్రామాల్లో ప్రజలతో ముఖాముఖీ నిర్వహించారు. ఉగాది నాటికి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటిస్థలం ఇస్తామని హామీ ఇచ్చారు. అమ్మఒడి పథకం ద్వారా తల్లులకు 15 వేల రూపాయలు బ్యాంకు ఖాతాలో వేస్తామన్నారు. వచ్చే అక్టోబర్ నుంచి నగదును రైతుల ఖాతాలో జమ చేస్తామని తెలిపారు.