కాపు నేస్తం పథకం అమలుపై ఆనందం వ్యక్తం చేస్తూ.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో కాపు మహిళలు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తణుకు పురపాలకసంఘ కార్యాలయ ఆవరణలో జరిగిన ఈకార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు పాల్గొన్నారు.
తణుకులో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం
పశ్చిమగోదావరి జిల్లా తణుకులో కాపు మహిళలు ముఖ్యమంత్రి జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తణుకులో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం
కాపు నేస్తం ద్వారా తమ కుటుంబాలకు ఆర్ధిక భరోసా కల్పించారంటూ మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. 45 సంవత్సరాలు నిండిన మహిళలందరికీ ఈపథకాన్ని వర్తింపచేశారని, రాష్ట్ర వ్యాప్తంగా 354 కోట్ల రూపాయలను వారి ఖాతాల్లో జమచేశారని ఎమ్మెల్యే అన్నారు. అమ్మ ఒడి పథకం, సున్నావడ్డీ పథకాల ద్వారా మహిళలకు ప్రయోజనం చేకూర్చారని అన్నారు.
ఇదీ చదవండి: