ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"రీఎంట్రీలు ఉంటేనే ఓట్లు తొలగిస్తున్నాం..." - ఫార్మ్-6

ఓటు నమోదుకు ఫారం-6 దరఖాస్తు చేసుకోవడానికి ప్రజలు మీ-సేవా కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. పారం-7 దరఖాస్తులపై ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ మేరకు రీఎంట్రీలు ఉంటేనే తొలగిస్తున్నామని బూత్ స్థాయి అధికారులు చెబుతున్నారు.

ఫార్మ్-6 దరఖాస్తునకు మీ-సేవా కేంద్రాల వద్ద ఓటర్లు

By

Published : Mar 13, 2019, 9:35 AM IST


పశ్చిమగోదావరిజిల్లాలో ఓటర్ల జాబితా తప్పులతడకగా మారింది. బతికున్నవాళ్ల ఓట్లనే తొలగించారు. చనిపోయారంటూ కారణం చూపారు. కొందరి ఓట్లు రెండేసి పోలింగ్ బూత్ కేంద్రాల్లో ఉన్నాయి. ఓటరు గుర్తింపు కార్డులు ఉన్నా... జాబితాలో పేరు ఉండటంలేదు. ఓటు ఉందో లేదో తెలుసుకునేందుకు ఆన్​లైన్​లోనే వెసులుబాటు కల్పించింది ఎన్నికల సంఘం. ఇది తెలియని చాలా మంది తహశీల్దార్ కార్యాలయాల చుట్టు తిరుగుతున్నారు. 1950 నెంబర్‌ సరిగా పని చేయడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఇన్ని ప్రయత్నాలు చేసిన కొందరు ఫారం-6 నింపేందుకు మొగ్గుతున్నారు. అలాంటి వారందరితో మీసేవా కేంద్రాలు కిక్కిరిసిపోతున్నాయి.
పనిలో పనిగా ఫారం-7 కిందా దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఈ అర్జీలను అధికారులు క్షణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలో 38వేల ఫారం-7 దరఖాస్తులు వచ్చాయి. వీటిపై పూర్తిస్థాయిలో అధికారులు విచారించారు. కేవలం 17వందల దరఖాస్తులే అర్హమైనవి తేల్చారు. మిగిలినవి ఓటరు ప్రమేయం లేకుండా పెట్టినవేనని తేలింది. బోగస్ దరఖాస్తులపై 38 కేసులు నమోదు చేశారు. ఫారం-7 దరఖాస్తులను క్షణ్ణంగా పరిశీలించి... పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి, రీఎంట్రీలు ఉంటే తొలగిస్తున్నామని బూత్ స్థాయి అధికారులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:ఎన్నికల్లో అలసత్వానికి తావివ్వకండి : కలెక్టర్ ప్రవీణ్ కుమార్

ABOUT THE AUTHOR

...view details