తండ్రికి కుమార్తె తలకొరివి! - తాడేపల్లి గూడెం
తల్లిదండ్రులకు తలకొరివిపెట్టి...కర్మకాండలు జరిపించి..వారిని పున్నామ నరకం నుంచి కొడుకులే తప్పిస్తారన్న పాతకాలం సంప్రదాయం అనాదిగా వస్తోంది. ఈ మధ్య కాలంలో కుమార్తెలు సైతం కన్నవారి కర్మకాండలు చేసున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం.
అనాదిగా వస్తున్న సంప్రదాయాలు పక్కనపెట్టి... కూమార్తె తన తండ్రికి తలకొరివి..పెట్టి కర్మకాండలు చేసిన ఘటన పశ్చిమ గోదావరిజిల్లా తాడేపల్లిగూడెం మండలం కొండయ్యపాలెంలో చోటు చేసుకొంది. కొండయ్యపాలానికి చెందిన వెంకటేశ్వరరావు అనారోగ్యంతో మరణించారు. గోదావరి ఒడ్డున కొవ్వూరు గోష్పాదంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలే కావడంతో పెద్దకూతురు ప్రసన్న లక్ష్మీ చితికి నిప్పంటించింది. కాలం చెల్లిన సంప్రదాయాలకు చరమగీతం పాడుతూ.. కర్మకాండలు చేయొచ్చని ప్రసన్నలక్ష్మీ రుజువు చేసింది.