పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలోని యూనియన్ బ్యాంక్‌కు మంగళవారం వచ్చిన ఖాతాదారులు భౌతిక దూరం మాటే మరిచారు. బారులు తీరారు. 3 రోజులు సెలవు వచ్చిన కారణంగా.. బ్యాంకు తీసే సమయానికే పెద్ద సంఖ్యంలో వేచి ఉన్నారు.
భౌతిక దూరం పాటించకుండా ఒకరి వెనుక మరొకరు అతి సమీపంగా నిలబడ్డారు. బ్యాంక్ సిబ్బంది తలుపు తెరిచిన అనంతరం నిబంధనలు పాటించి ఖాతాదారులను అనుమతించారు. భౌతిక దూరం పాటించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.