ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భారీ వర్షాలతో నేల రాలిన మామిడి, అరటి - భారీ వర్షాలతో నేల రాలిన మామిడి, అరటి వార్తలు

పశ్చిమగోదావరి జిల్లాలో కురిసి భారీ వర్షం రైతులను నిలువునా ముంచేసింది. చేతికొచ్చిన పంట నేలపాలైంది. జంగారెడ్డిగూడెంలో వెయ్యి హెక్టార్లలో మామిడి నాశనమైంది. 500 హెక్టార్లలో అరటి పాడైంది. తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరారు.

crop-damage-with-heavy-rain-in-jangareddy-gudem
crop-damage-with-heavy-rain-in-jangareddy-gudem

By

Published : Apr 9, 2020, 4:06 PM IST

భారీ వర్షాలతో నేల రాలిన మామిడి, అరటి

పశ్చిమగోదావరి జిల్లాలో కురిసిన భారీ వర్షానికి మెట్ట మన్యం మండలాల్లో పలుచోట్ల పంటలు నేలవాలాయి. జంగారెడ్డిగూడెం, బుట్టాయిగూడెం, కొయ్యలగూడెం, గోపాలపురం, చింతలపూడి, మండలాల్లో మామిడి, అరటి, మొక్కజొన్న, వరి రైతులు నష్టపోయారు. ఇప్పుడు కురిసిన వర్షంతో భారీగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం పరిధిలో సుమారు వెయ్యి హెక్టార్లలో మామిడి కాయలు నేలరాలాయని చెబుతున్నారు. 500 హెక్టార్లలో అరటి పంట పడిపోయింది. మొక్కజొన్నలు కల్లాల్లోనే తడిసి ముద్దయ్యాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు కుప్పకూలాయి. నష్టపరిహారాన్ని అంచనా వేసి ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details