ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సామాన్యులకు ఇసుక అందించడంలో ప్రభుత్వం విఫలం: సీపీఐ రామకృష్ణ - సీపీఐ రామకృష్ణ తాజా వార్తలు

సామాన్యులకు ఇసుక అందించడంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. సామాన్యులకు ఉచితంగా ఇసుక అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

cpi ramakrishna
cpi ramakrishna

By

Published : Nov 6, 2020, 3:47 PM IST

వైకాపా ప్రభుత్వం పాలన పగ్గాలు చేపట్టి 17 నెలలు అవుతన్నా.. సామాన్యుడికి ఇసుక అందించలేకపోతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. ఇసుక సరఫరాలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో సీపీఐ రామకృష్ణ పర్యటించారు. 17నెలల తర్వాత ఇసుక విధానంపై ప్రజల నుంచి సలహాలు, సూచనలు అడగడం విడ్డూరంగా ఉందన్నారు. మూడు జిల్లాలకు ఒక కాంట్రాక్టర్​ను ఏర్పాటు చేసి.. ఇసుక దందాకు తెరలేపే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. సామాన్యులకు ఉచితంగా ఇసుక అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు.

ఇదీ చదవండి:పెళ్లి ఇంటి నుంచి 3 కిలోల బంగారం చోరీ

ABOUT THE AUTHOR

...view details