ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జోరుగా అమ్మకాలతో మద్యం దుకాణాలు కళకళ

లాక్ డౌన్ కారణంగా మూతబడ్డ మద్యం దుకాణాలు ఈరోజు తెరుచుకున్నాయి. మందుబాబుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో మండుటెండలో సైతం మద్యం కోసం ఎదురు చూశారు.

కళకళలాడుతున్న మద్యం దుకాణాలు ... జోరుగా సాగుతున్న అమ్మకాలు
కళకళలాడుతున్న మద్యం దుకాణాలు ... జోరుగా సాగుతున్న అమ్మకాలు

By

Published : May 4, 2020, 7:19 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో మద్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి మద్యం ప్రియులు దుకాణాల వద్దకు చేరుకున్నారు. చింతలపూడి ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో ఉన్న టీ నరసాపురం మద్యం దుకాణం మినహా... మిగిలిన అన్ని దుకాణాల్లో విక్రయాలు జరుగుతున్నాయి.

జంగారెడ్డిగూడెం కొవ్వూరు పోలవరం ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో మద్యం దుకాణాలు ఉదయం 11 గంటలకు తెరుచుకున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మందుబాబుల గుంపులు చెదరగొట్టేందుకు పోలీసులు నానా తంటాలు పడ్డారు.

పోలవరం నియోజకవర్గంలో మద్యం అమ్మకాలు సర్వర్ సమస్యతో ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. జీలుగుమిల్లి మద్యం దుకాణం వద్ద మందుబాబులు బారులుతీరారు. ఎటువంటి నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా మద్యం విక్రయించగా.. ప్రజలు ఆగ్రహించారు.

నరసాపురం నియోజకవర్గంలో పలు చోట్ల ఉదయం నుంచి మద్యం కోసం బారులు తీరారు. కేపీ పాలెం, తూర్పుతాళ్లు, ఎల్బీచర్ల, నరసాపురం, మొగల్తూరు, వేములదీవి తదితర ప్రాంతాల్లో దుకాణాలు వద్ద ముందు బాబులు వేచి చూడడంపై.. స్థానికులు ఆందోళన చెందారు.

ఉంగుటూరు నియోజకవర్గం లో 4 మండలాలు ఉండగా భీమడోలు మండలం ఆరెంజ్ జోన్, నిడమర్రు, గణపవరం మండలాలు గ్రీన్ జోన్ లో ఉన్నాయి. ఈ మూడు మండలాల్లో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. ఉంగుటూరు మండలం రెడ్ జోన్ గా ప్రకటించడంతో ఇక్కడ 7 మద్యం దుకాణాలు తెరవలేదు.

ఇదీ చూడండి:

కరోనా భయాలు బేఖాతరు- మద్యం కోసం ఎగబడ్డ జనం

ABOUT THE AUTHOR

...view details