పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం పురపాలక సంఘ కార్యాలయంలో అత్యవసర కౌన్సిల్ సమావేశం జరిగింది. పురపాలక తాత్కాలిక అధ్యక్షుడు మారిశెట్టి సుబ్బారావు అధ్యక్షతన సమావేశం జరిగింది. ప్రభుత్వ స్థలంలో అక్రమ కట్టడాలు జరుగుతున్నాయని పలువురు కౌన్సిలర్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. కోట్లాది రూపాయల విలువ కలిగిన స్థలంలో నిర్మాణాలు జరుగుతుంటే.. అధికారులు ఎందుకు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. అధికారుల నుంచి సరైన సమాధానం రాకపోవటంతో ...16 మంది తెదేపా కౌన్సిలర్లు సమావేశం నుంచి వాకౌట్ చేశారు. ఫలితంగా ఎజెండా వాయిదా వేయాల్సి వచ్చింది.
అక్రమ కట్టడాలపై... అత్యవసర సమావేశం - తాడేపల్లి గూడెం
తాడేపల్లిగూడెంలో అక్రమ కట్టడాలపై పాలకవర్గం అప్రమత్తమైంది. తత్కాలిక అధ్యక్షుడి నేతృత్వంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ స్థలంలో అక్రమ కట్టడాలను సహించేది లేదని కౌన్సిలర్లు హెచ్చరించారు.
తాడేపల్లి గూడెం పురపాలక కార్యాలయం