ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పశ్చిమ గోదావరి జిల్లాలో పోలీస్ సిబ్బందికి కరోనా వ్యాక్సినేషన్ - west goadavari district latest news

పశ్చిమ గోదావరి జిల్లాలో పోలీస్ సిబ్బందికి కరోనా వ్యాక్సిన్​ కార్యక్రమం ప్రారంభమైంది. జిల్లా ఎస్పీ నారాయణ్ నాయక్ టీకాను వేయించుకున్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్​ వేయించుకోవాలన్నారు.

corona vaccination on police department
పశ్చిమ గోదావరి జిల్లాలో పోలీస్ సిబ్బందికి కరోనా వ్యాక్సినేషన్

By

Published : Feb 24, 2021, 5:21 PM IST

పశ్చిమ గోదావరి జిల్లాలో పోలీస్ సిబ్బందికి కరోనా వాక్సిన్​ను అన్ని పోలీసు స్టేషన్​లలో, ఏలూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో వైద్యులు టీకాలను వేశారు. జిల్లా ఎస్పీ నారాయణ్ నాయక్​కు కరోనా వ్యాక్సిన్ వేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారాలతో టీకాను ఫ్రంట్ వారియర్స్​గా ఉన్న పోలీస్ సిబ్బందికి అందించామని ఎస్పీ తెలిపారు. టీకాని తయారుచేసిన వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్​ వేయించుకోవాలని అధికారులు తెలిపారు.

తొలి డోసు వేసుకున్నాక 28 రోజులపాటు శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. టీకా వేసుకున్న నాలుగు రోజుల పాటు మద్యం ముట్టొద్దని, పొగతాగరాదని, పోషకాహారం తీసుకోవాలని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి

ఐదేళ్ల చిన్నారి రిషిత ప్రతిభ.. లింబో ఫైర్ స్కేటింగ్​లో ప్రపంచ రికార్డు

ABOUT THE AUTHOR

...view details